Tuesday, 9 August 2016

మరణమైన తర్వాత తిరిగి లేచే వరకు మూడు రోజులు పాటు  యేసుక్రీస్తు వారు ఎక్కడకు వెళ్ళారు ?

    ఈ విషయం మీద క్రైస్తవులు అనేక విధాలుగా విడిపోయారు. ఎక్కువ మంది నమ్మేదేమిటంటే , యేసు యొక్క శరీరం సమాధిలోనే వుంది కానీ అయన ఆత్మ మరియు ప్రాణం "షియోల్" లేక "భూమి యొక్క క్రింది భాగాలకు" వెళ్లాడని అంటారు. "షియోల్" లో రెండు భాగాలుంటాయి.  పరదైసు మరియు పాతాళం.  పాతనిబంధన కాలములో చనిపోయిన వారందరు ఈ రెండు స్థలాలలో ఏదో స్థలానికి  వెళ్తారు. విశ్వాసులు పరదైసుకి, అవిశ్వాసులు పాతాళానికి వెళ్తారు. యేసుక్రీస్తు వారు చెప్పిన ధనవంతుడు - లాజరు ఉపమానములో ఈ రెండు స్థలాలు మనం చూడగలం. (లూకా  16:19-31). లాజరు పరదైసులో ఉన్నాడు (దీనినే అబ్రాహాము రొమ్ము అని కూడా పిలుస్తారు), మరియు ధనవంతుడు పాతాళములో ఉన్నాడు. ఈ రెండు స్థలాలను ఒక గొప్ప అగాదం వేరుచేస్తుంది.  పాతాళములో ధనవంతుడు యాతనపడుచున్నాడు. (లూకా  16:23-24), పరదైసులో లాజరు ఆదరణ పొందుచున్నాడు. (లూకా  16:25).

     యేసుక్రీస్తు వారు సిలువ మీద వున్న దొంగకు కూడ వాగ్దానం చేసాడు.  "దొంగను పరదైసుకు తీసుకెళ్తానని" ఎందుకంటే దొంగ యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచాడు.  (యోహాను  21:13).     యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు, ఆయన మూడు రోజులు (మత్తయి 12:40) పాటు షియోల్ లో ఉన్నవారికి అయన యొక్క విజయము గురించి మరియు సువార్త చెప్పాడు.  (1 పేతురు  3:19)(1పేతురు  4:6). ఇది పరదైసులో ఉన్నవారికి సంతోషకరమైన వార్త అయితే  పాతాళములో ఉన్నవారికి దుఖః వార్త      ఏది ఏమైనా యేసు యొక్క ఆత్మ పాతాళములో విడువబడలేదు కానీ మూడవ రోజున సజీవంగా తిరిగి లేచాడు. (కీర్తన  16:10)(అపో  2:27,31)    కొంతమంది ఏమి నమ్ముతారంటే , ఆ మూడు రోజులు యేసుక్రీస్తు పరదైసులో ఉన్నవారిని పరలోకం తీసుకెళ్లాడు అని అంటారు.  ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే,  "ముందు యేసుక్రీస్తు వారు ఒక్కరే  పరలోకం వెళ్లారు" తర్వాత మిగతా వారిని తీసుకెళ్లారు. ఎందుకంటే అయన పునరుత్తానుడైన  తర్వాత మరియ అయన పాదములు పట్టుకొనబోయినప్పుడు యేసుక్రీస్తు వారు వారించారు. మరియా నేను నా తండ్రి యొద్దకు ఇంకా ఎక్కి వెళ్ళలేదు. కాబట్టి నన్ను తాకవద్దు అన్నారు.  (యోహాను  20:17).     

No comments:

Post a Comment