అన్ని పాపాలు అన్ని దేవుని దృష్టిలో ఒకటే . ఇది కరెక్టేనా?
దాదాపుగా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గురించే ఏదో ఒక సందర్బములో మాట్లాడే ఉంటారు. అంతేకాక దీన్ని ప్రతి ఒక్కరు నమ్ముతారు. అయితే "పాపము అంతా ఒకటే" అని బైబిల్ లో ఎక్కడ చెప్పబడలేదు. అబద్ధికుడిని , నరహంతకుడిని దేవుడు ఒకేలా చూస్తాడనుకోవడం కరెక్ట్ కాదు. దేవుడు దేన్ని ఎక్కువ నీచంగా చూస్తాడు? హిట్లర్ ఒక లక్ష మందిని మోసం చేసాడు అనేదాన్న? లేక హిట్లర్ లక్ష మందిని చంపాడు అనేదాన్న?
బైబిల్ లోనుండి కొన్ని ఉదాహరణలు చూద్దాం.
పాతనిబంధనలో దొంగతనానికి దేవుడు ఏమి శిక్ష విధించాడు? నష్టపరిహారం (నిర్గ 22:1-4)
(లేవి 6:2-5)(2 సమూ 12:6). దొంగిలించిన దానితో వడ్డీ కలిపి చెల్లించాలి. మరి ఒక వ్యక్తిని చంపినా నరహంతకుడికి దేవుడు ఏమి శిక్ష విధించాడు? ఆ నరహంతకుడిని కూడా చంపివేయాలి.
(నిర్గ 21:12-14,23-25)(సంఖ్యా 35:16-21,29-31)(ఆది 9:6).
(నిర్గ 21:12-14,23-25)(సంఖ్యా 35:16-21,29-31)(ఆది 9:6).
ఒకవేళ రెండు పాపాలు ఒకటే అయితే శిక్షలు కూడా ఒకేలా ఉండాలి గదా? మరి ఒక దానికి నష్టపరిహారం మరియొక దానికి మరణశిక్ష ఎందుకు చెప్పాడు? కాబట్టి దేవుడు దొంగని, నరహంతకుడుని ఒకేలా చూడడు అని మనకు పై వచనాలు ద్వారా అర్థం అవుతుంది.
ఇంకా కొన్ని పాపములను గురించిన వచనాలను చూద్దాం.
(యెహెఙ్కేలు 8:6,13,15) ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు యొక్క పాపాల జాబితాను గురించి మాటలాడుచున్నాడు. ఈ పాపాల జాబితా ఒకదాని మించి మరొకటి వుంది.
(యోహాను 19:11)(యేసు పిలాతుతో చెప్పాడు) నీకు పైనుండి అనుగ్రహించబడితేనే గాని నామీద ఎలాంటి అధికారం లేదు. నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను.
(యాకోబు 3:1) నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. (తప్పుడు బోధకులకు)
( యెహెఙ్కేలు16:52) నీవు వారికంటె అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు; నీవు వారికి విధించిన అవమానశిక్ష నీకే రావలెను; నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము.
నరకములో కూడా కొంతమందికి మిగతావారి కంటే అధికమైన శిక్షలు విధించబడతాయి. ఎందుకని? దేవుడు అన్ని పాపాలు సమానంగా చూసినప్పుడు కొందరికి అధికమైన శిక్షలు ఎందుకు?
(లూకా 12:47-48) ఏ సేవకుడు తన యజమానుని యొక్క చిత్తమెరిగి, సిద్దపడక , అయన చిత్తము చొప్పున చేయకుండా ఉండునో ఆ సేవకునికి అధికమైన దెబ్బలు తగులుతాయి. (48) అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్య బడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా పొందజూతురు.
(యిర్మీయా 16:18)వారు తమ హేయదేవతల కళేబరములచేత నా దేశమును అపవిత్ర పరచియున్నారు, తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టియు వారి పాపమును బట్టియు రెండంత లుగా వారికి ప్రతికారము చేసెదను.
(మార్కు 12:40) విధవరాండ్ర యిండ్లు దిగమిం గుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను.
(ఆది 4:15) అందుకు యెహోవా అతనితోకాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను.
(హెబ్రీ 10:29) ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?
(మత్తయి 11:24) విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
(యెషయా 40:2) యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు శిక్ష పొందెను.
(యిర్మీయా 17:18) రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము అని యిర్మీయా అడుగుచున్నాడు.
ఎందుకు దేవుడు కొన్ని పాపములను "హేయకృత్యములు" అని అంటున్నాడు? అంటే అన్ని పాపములు ఒకటి కాదు అని అర్ధం.
ఒక విదంగా చూస్తే పాపాలన్నీ సమానమే. నరహత్య చేస్తే ఏవిదంగా పరలోకం వెళ్ళలేమో అబద్దం ఆడిన కూడా పరలోకం వెళ్లలేము. ఏ పాపి కూడా పరలోకం వెళ్ళలేడు . దొంగ అయినా అబద్ధికుడైన, నరహంతకుడైన ఎవరైనా సరే వెళ్ళలేరు. పరలోకం వెళ్లాలంటే మనం పరిపూర్ణులం కావాలి. కానీ మనమెప్పటికీ పరిపూర్ణులం కాలేము. అందుచేతనే మనకు యేసుక్రీస్తు కావాలి. యేసు పరిపూర్ణ జీవితం జీవించాడు. కాబట్టి ఎప్పుడైతే మనం మారుమనస్సు పొందుతామో అప్పుడు ఆయన యొక్క పరిపూర్ణత మనకు అనుగ్రహించబడుతుంది. అయన రక్తము మన దోషములను కప్పివేస్తుంది. మరియు దేవుడు మనలను పరలోకానికి అంగీకరించేటట్లు చేస్తుంది.
మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే , ఏ పాపమైన సరే మనలను దేవునికి దూరం చేస్తుంది. అది దేవునితో మనకున్న ఐక్యతను పాడుచేయలేదు కానీ దేవునితో మనకున్న సహవాసమును పాడుచేస్తుంది. అందుకనే మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపపడి, వాటిని ఒప్పుకొని ప్రభువుతో మన సహవాసమును కొనసాగించాలి. .

No comments:
Post a Comment