మొత్తం 42 మంది రాజులు (ఒక రాణి కూడా వుంది) . సౌలు మొదటి రాజు, అతను ఇశ్రాయేలు 12 గోత్రాలను 40 సంవత్సరాల పాటు పరిపాలించాడు. సౌలు మరణం తర్వాత రాజ్యం తాత్కాలికంగా రెండు గా విడిపోయింది. సౌలు కుమారుడు ఇష్బోషెతు ఇశ్రాయేలు 11 గోత్రాలను 2 సంవత్సరాలపాటు పరిపాలించాడు. అదే విదంగా యూదాను దావీదు పరిపాలించాడు. ఇష్బోషెతు హత్య గావించబడిన తర్వాత దావీదు 12 గోత్రాలమీద రాజుగా ఉన్నాడు. అతని కుమారుడైన సొలొమోను కూడా ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా ఉన్నాడు. డేవిడ్, సొలొమోను ఇద్దరు చెరో 40 సంవత్సరాల పాటు పరిపాలించారు.
సొలొమోను తర్వాత రాజ్యం రెండుగా విడిపోయింది. దక్షిణ రాజ్యము (యూదా, బెన్యామీను గోత్రాలు దీన్నే యూదా రాజ్యము అంటారు ) ఉత్తర రాజ్యము (మిగిలిన 10 గోత్రాలు దీన్నే ఇశ్రాయేలు అంటారు). దీని ఫలితమే యూదాను 19 రాజులు, ఒక రాణి పాలించారు. ఇశ్రాయేలును 19 మంది రాజులు పాలించారు. క్రింది పట్టిక చూడండి. బ్రాకెట్లలో ఉన్నవి పరిపాలించిన సంవత్సరాలు.
| ఇశ్రాయేలు రాజులు | యూదా రాజులు |
|---|---|
| 1. యరొబాము 1 (22 yrs) | 1. రెహోబాము (17 yrs) |
| 2. నాదాబు (2 yrs) | 2. అబీయా (3 yrs) |
| 3. బయెషా (24 yrs) | 3. ఆసా (41 yrs) |
| 4. ఏలా (2 yrs) | 4. యెహోషాపాతు (25 yrs) |
| 5. జిమ్రి (7 days) | 5. యెహోరాము (8 yrs) |
| 6. ఒ మ్రి (12 yrs) | 6. అహజ్యా (1 yr) |
| 7. అహాబు (22 yrs) | 7. అతల్యా రాణి (6 yrs) |
| 8. అహజ్యా (2 yrs) | 8. యోవాషు (40 yrs) |
| 9. యెహోరాము (12 yrs) | 9. అమజ్యా (29 yrs) |
| 10. యెహూ (28 yrs) | 10. అజర్యా (ఉజ్జియా )(52 yrs) |
| 11. యెహోయాహాజు (17 yrs) | 11. యోతాము (16 yrs) |
| 12. యెహోయాజు (16 yrs) | 12. ఆహాజు (16 yrs) |
| 13. యరొబాము 2 (41 yrs) | 13. హిజ్కియా (29 yrs) |
| 14. జెకర్యా (6 నెలలు ) | 14. మనష్షే (55 yrs) |
| 15. షల్లూము (1 నెల ) | 15. ఆమోను (2 yrs) |
| 16. మనహేము (10 yrs) | 16. యోషీయా (31 yrs) |
| 17. పెకహ్యా (2 yrs) | 17. యెహోయాహాజు (3 నెలలు ) |
| 18. పెకహు (20 yrs) | 18. యెహోయాకీము (11 yrs) |
| 19. హోషేయా (9 yrs) | 19. యెహోయాకీను (3 నెలలు ) |
| 20. సిద్కియా (11 yrs) |
ఈ పట్టిక ప్రకారము ఇశ్రాయేలు రాజులందరూ చెడ్డవారు. యూదా రాజులలో 8 మంది మంచివారు మిగతా 12 మంది చెడ్డవారు. (ఆసా, యెహోషాపాతు, యోవాషు, అమజ్యా, అజర్యా ,యోతాము, హిజ్కియా, మరియు యోషీయా )

No comments:
Post a Comment