నీతిమంతులుగా తీర్చబడుట , పరిశుద్దులుగా మార్చబడుట , మహిమ పరచబడుట అంటే ఏమిటి?
నీతిమంతులముగా తీర్చబడుట:
ప్రతి మనిషి ఈ భూమి మీద పాపి అని బైబిల్ చెప్తుంది. (1 యోహాను 1:8,10)(రోమా 3:10,23) (ప్రసంగి 7:20)(1 రాజులూ 8:46). ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు (1 పేతురు 1:16)(యెషయా 57:15)(లేవి 20:26)(లూకా 1:49), అయన పాపాన్ని చూడలేదు. (హబక్కుక్ 1:13). తండ్రియైన దేవునితో మనకు సహవాసం కావాలంటే పాపంలేని పరిశుద్ధ జీవితం అవసరం. ఇది మనం ఎప్పటికి చేరుకోలేము కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగా, నీతిగా, యదార్ధముగా జీవించాడు. చివరగా అయన సిలువపై చనిపోయాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తం కొరకు అయన సిలువపై రక్తం చిందించాడని బైబిల్ చెప్తుంది (కొలొస్స 1:14)(ఎఫెసీ 1:7)(హెబ్రీ 10:16-19)(1 యోహాను 1:7)(ప్రకటన 1:5).
యేసు సిలువ మీద ఉండగా రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాడు. మొదటిది (మత్తయి 27:46)( 15:34) "నా దేవా దేవా నన్నెందుకు చేయి విడచితివి" అనేది. సర్వలోక పాపాలు అయన మీద మోపబడినప్పుడు , అయన తండ్రి నుండి వేరుచేయబడ్డాడు కాబట్టి తన జీవితములో మొట్టమొదటి సారి తండ్రిని ప్రశ్నించాడు. రెండవది "సమాప్తమైనది" (యోహాను 19:30) అని చెప్పాడు. ఈ సమయములో యేసుక్రీస్తు వారు చేయవలసిన "పాప పరిహారం" సమాప్తమైనది కాబట్టి తన ఆత్మను తండ్రికి అప్పగించి చనిపోయాడు. ఇదే నీతిమంతులముగా తీర్చబడుట అంటే.
నీతిమంతులముగా తీర్చబడుట అంటే, ఒక మనిషి తను చేసిన ఎలాంటి మంచి పనుల ద్వారా కాకుండా కేవలం యేసుక్రీస్తు సిలువ బలియాగంనందు విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని కన్నుల ఎదుట నీతిమంతుడుగా తీర్చబడుట. (గలఁతి 2:16)(రోమా 3:28)(రోమా 4:4-5)(గలఁతి 5:4), మనిషి కేవలం యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా కృప చేతనే నీతిమంతుడుగా తీర్చబడుట. (రోమా 3:24) (రోమా 5:1)(గలతీ 3:24)(1 కోరింతి 6:11). ఎప్పుడైతే మనం క్రీస్తునందు విశ్వాసముంచుతామో ఆ క్షణమే క్రీస్తు యొక్క నీతి, పరిపూర్ణత, పాప రహితమైన స్థితి మనకు అనుగ్రహించబడుతుంది. (2 Cor 5:19,21)లో చెప్పబడిన రీతిగా దేవుడు పాపమెరుగని క్రీస్తు ద్వారా లోకమును తనతో సమాధాన పరచుకోవాలనుకున్నాడు. (దీన్ని కూడా చూడండి. : రోమా 4:7-8,24-25) మన పాపములు రద్దు చేయబడినవి, క్షమించబడినవి. ఆ క్షణం నుండి యేసుక్రీస్తు ద్వారా తండ్రియైన దేవునితో సదా కాలము మనం సహవాసము కలిగి ఉండవచ్చు. (యోహాను 14:6)(మత్తయి 11:27)(హెబ్రీ 10:19-20).
పరిశుద్ధపరచ బడుట:
పరిశుద్ద పరచబడుట అనే పదం ""hagiazo" అనే గ్రీకు పదం ద్వారా వచ్చింది. దీని అర్ధం " పరిశుద్ద పరచబడుట" లేక "దేవుని కోసం వేరుగా ఉండుట". మనం నీతిమంతులముగా తీర్చబడిన తర్వాత "పరిశుద్ధపరచబడుట" మొదలవుతుంది. పైన చెప్పబడిన విదంగా "నీతిమంతులముగా" తీర్చబడుట ఒక క్షణంలో జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ కాదు. ఇంకొక వైపు "పరిశుద్ద పరచబడుట" అనేది నిరంతర ప్రక్రియ . మనం నీతిమంతులముగా తీర్చబడిన తర్వాత మరింత పరిశుద్ధత కొరకు పరిశుద్ధ పరచబడే ప్రక్రియను ఆరంబించాలి. (1 పేతురు 1:15-16)(1థెస్స 4:7)(లేవి 11:44-45).
మనం నీతిమంతులముగా తీర్చబడిన మరుక్షణం దేవుడు పరిశుద్ధ ఆత్మ రూపములో మనలో కొస్తాడు. (ఎఫెసీ 1:13-14)(ఎఫెసీ 4:30)(2 కొరింతి 5:5)(2 కొరింతి 1:22). మరింత పరిశుద్ధలోనికి మారడానికి పరిశుద్దాత్మ దేవుడు సహాయ పడతాడు. (2 థెస్స 2:13)(1పేతురు 1:2) మన జీవితములో పాపములన్నియు చూపిస్తాడు. అంతేకాక యేసుక్రీస్తు (1 కొరింతి 1:2)(అపో 26:18)(హెబ్రీ 2:11)(హెబ్రీ 10:10) మరియు తండ్రియైన దేవుడు కూడా మనకు సహాయపడతారు. (యూదా 1:1) . ఈ ప్రక్రియ కొన్నిసార్లు చాల నొప్పి, బాధను కలిగించవచ్చు. కానీ ఇది దేవుడు ఆయనకు మనమీద వున్నా ప్రేమతో చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాక మనం భరించలేని దాని కంటే ఎక్కువ మనకు ఇవ్వదు. (1 కొరింతి 10:13).
తండ్రి , కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు మనకు సహాయం చేస్తున్నప్పటికీ పరిశుద్ధత విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మనమే ( 2 తిమోతి 2:21)(హెబ్రీ 12:14). దేవుని వాక్యమును బాగా చదవాలి ఇదే మంచి చెడులను గురించి తెలియచేస్తుంది. ఈప్రక్రియ మన జీవితకాలమంతయు కొనసాగుతుంది. మరియు మనము వివిధ దశలలో శుద్దిచేయబడతాము, విశ్వాసముతో ఎదుగుతాము. మన లక్ష్యం ఏమిటంటే రోజు రోజుకి క్రీస్తు వలే మార్పుచెందడం. (ఎఫెసీ 4:13.15)(ఫిలిప్పి 3:12-14)(2 కొరింతి 3:17-18)( రోమా 8:29).
ఇది మీ జీవితంలో జరుగుతుందా? నిన్నటి కంటే ఈరోజు మరింత పరిశుద్ధంగా జీవించావా? పోయిన సంవత్సరము కంటే ఈ సంవత్సరము ఎక్కువగా పరిశుద్ధంగా జీవించావా? లేదంటే మీరు ఆత్మీయంగా ఎదగడం లేదు?" దేవుడు మీ కోసం సిద్ధం చేసిన వాటిని మీరు పోగొట్టుకొంటున్నారు. .
ఈ ప్రక్రియ మహిమ పరచబడడంతో ముగుస్తుంది. ఇది క్రింద వివరించడం జరిగింది.
మహిమ పరచబడుట :
మహిమపరచబడడం అనేది ఈ ప్రక్రియలోని మూడవ చివరి భాగము. ఈ ప్రక్రియ నీతిమంతునిగా తీర్చబడుటతో ఆరంబించబడి, రోజు రోజుకి అధికమైన పరిశుద్ధతలో ప్రవేశిస్తూ మహిమ పొందడంతో ముగుస్తుంది.
మహిమపరచబడుట అనేది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో జరుగుతుంది.(1 కొరింతి 15:50-54). ఆ సమయమున ఆరంభమునుండి ఇప్పటివరకు విశ్వాసులుగా వున్నవారికి ఒక నూతనమైన, పరిపూర్ణమైన, మహిమ కరమైన శరీరం ఇవ్వబడుతుంది. (ఫిలిప్పి 3:20-21)(రోమా 8:23). బైబిల్ చెప్పేదేమిటంటే మొదట, చనిపోయి పరలోకములో వున్నవారు మహిమ దేహములు ధరిస్తారు. ఆ తర్వాత సజీవులుగా భూమి మీద వున్నా మనము క్షణమాత్రములో ఆ మహిమ దేహములు దరిస్తాము. (1 థెస్స 4:13-18). ఈ శరీరాలు మరణం లేనివి, రోగాలు రానివి. (1 కొరింతి 15:42), మహిమకరమైన, శక్తివంతమైన వి (1 కొరింతి 15:43), మరియు ఆత్మీయమైనవి. (1 కొరింతి 15:44).
ఈ శరీరాలతో మనం దేవుని యొద్ద పరలోకములో యుగయుగములు ఉండబోతున్నాము.
(2 తిమోతి 2:10)(1 పేతురు 5:10)(2 కోరితి 4:17).
(2 తిమోతి 2:10)(1 పేతురు 5:10)(2 కోరితి 4:17).
అంతేకాకుండా పాపములేని, ఏడ్పులేని, బాధలేని, దుఃఖములేని పర లోకములో మనముండబోతున్నాము. (ప్రకటన 21:27)(ప్రకటన 22:15). (ప్రకటన 21:4).
యేసుక్రీస్తు చనిపోయి, మూఢవ రోజున తిరిగిలేచిన తర్వాత పరలోకానికి వెళ్లబోయే ముందు అయన 40 రోజులు భూమి మీద గడిపాడు. (అపో 1:3) . దీనిని పునరుత్థానము అంటారు. ఈ సమయములో అయన మహిమ దేహముతో ఉన్నాడు. బైబిల్ చెప్తుంది మృతులలోనుండి ప్రథముడిగా తిరిగి లేచింది యేసు మాత్రమే. (1 కొరింతి 15:20) తర్వాత మనము.
కాబట్టి క్రిస్తవ విశ్వాసానికి ముఖ్యమైనది యేసుక్రీస్తు పునరుత్థానము. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి అయన ద్వారా మనం కూడా ఒకరోజు మరణమును జయిస్తాము.
(యోహాన్ 14:19)(1 కొరింతి 6:14)(రోమా 8:11).
(యోహాన్ 14:19)(1 కొరింతి 6:14)(రోమా 8:11).
నీవు నిజంగా క్రైస్తవుడవైతే ఈ వాగ్దానమును నమ్ము. (ఫిలిప్పు 1:6) మీలో ఈ సత్క్రియ ఆరంబించినవాడు యేసుక్రీస్తు రాకడ వరకు దీనిని కొనసాగించును.
నీవు క్రైస్తువుడవు కాకపోతే యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొంది అయన అనుగ్రహించు రక్షణను పొందుము. అప్పుడు నీవు నిత్యత్వము వరకు అయనతో సదాకాలము మహిమ శరీరములతో జీవించగలము.
దేవుని స్తోత్రములు
దేవుని స్తోత్రములు
No comments:
Post a Comment