Tuesday, 9 August 2016

పాపముల  నుండి విడుదల పొందాలంటే  రక్తము చిందించాలని దేవుడు ఎందుకు కోరాడు?


    మొదటిగా నిర్గ 12:1-13 లోని "పస్కా" ఉదాహరణను చూద్దాము.  ఇక్కడ దేవుడు ఒక సంవత్సరము వయస్సు గలిగిన నిర్దోషమైన గొర్రెపిల్ల ను తీసుకొని దానిని చంపమని ఇశ్రాయేలీయులకు చెప్పారు. వారు దాని రక్తమును ఇంటి గుమ్మము యొక్క నిలువు కమ్మీల మీద,  అడ్డ కమ్మీల మీద రాయమని చెప్పాడు. దేవుడు ఐగుప్తు యొక్క మొదటి సంతానాన్ని సంహరించడానికి బయలుదేరి నప్పుడు అయన ఇశ్రాయేలీయుల ద్వారబందముల మీద రక్తమును చూసి ఆ ఇంటిని దాటిపోతాడు.  రక్తం చిందించడం వల్ల  వేరే వారికి జీవం ప్రసాదించబడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. 
     పాపంనకు జీతం మరణం  (రోమా  6:23), అది బౌతికంగా మరియు ఆత్మీయంగా. పాపమునకు క్షమాపణ మరియు మరణం నుండి విడుదల కొరకు ఎవరిదో ఒకరిది  ప్రాణం మరియు రక్తం అవసరం.   (హెబ్రీ  9:22).  ఒకరి విడుదల కొరకు ఒకరు ప్రాణం పోగొట్టుకోవాలి. 
    పస్కా సమయములో నిర్దోషమైన గొర్రెపిల్ల (యేసుక్రీస్తుకు సాదృశ్యం) వదించబడి, రక్తం చిందించి ఒక కుటుంబాన్ని రక్షిస్తుంది.
పాత నిబంధన కాలములో మనిషి పాపానికి  బదులు,  మనిషి   శుద్ధికి  బదులుగా జంతువులు వదించబడ్డాయి.  దేవుడు చెప్పాడు  (లేవి  17:11) ప్రతి జంతువు యొక్క ప్రాణం దాని రక్తములో ఉంటుంది.   రక్తం ప్రాణానికి సాదృశ్యం. ఎప్పుడైనా ఒక జంతువూ మరణించి దాని రక్తం చిందించబడినట్లైతే దానికి మారుగా ఇంకొక జంతువుకి ప్రాణం ప్రసాదించబడుతుంది.  
     అందుకనే దేవుడు ఏ జంతువు యొక్క రక్తాన్నైనా తినకూడదని చెప్పాడు.   (లేవి  17:12). ఏవరైనా రక్తాన్ని తింటే వాడు ఆ ప్రజలలోనుండి కొట్టివేయబడతాడు. (లేవి  17:14).
   అయినప్పటికీ ఎద్దులు యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయలేదని దేవుడు చెప్పాడు. (హెబ్రీ  10:4).  పాత నిబంధన బలులు విధానం, ప్రధానయాజకుడు ఇవన్నీ  యేసుక్రీస్తుకు ముంగురుతు మాత్రమే . కేవలం యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మాత్రమే మన పాపములకు విమోచన, విరుగుడు, మరియు విడుదల.  (మత్తయి  26:28)(కొలొస్స  1:14)(ఎఫెసీ  1:7). అయన రక్తం ప్రతి పాపమునుండి మనలను కడుగుతుంది. (1యోహాను  1:7). యేసుక్రీస్తు వారి యొక్క శరీరము మనకొరకు ఒక్కసారే అప్పగించబడుటవలన సదా కాలమునకు మనము పరిశుద్ధులము కాగలము.   (హెబ్రీ  10:10).
 పాతనిబంధన కాలములో వున్నవారు భవిష్యత్తులో  జరగబోయే సిలువ కార్యమును చూసి జీవించారు.  కొత్తనిబంధన కాలములో ఉన్న మనము ఇంతకుముందే జరిగిం చబడిన  సిలువ కార్యమును చూస్తూ జీవించాలి. 

No comments:

Post a Comment