ఏదెను తోట ఎక్కడ ఉండేది? (ఒకప్పుడు)
అనేకమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఏదెను తోట ఇరాక్ లో గాని దానికి దగ్గరలోగాని ఉండేది. ఇంకా చెప్పాలంటే మెసపటోమియా ప్రాంతం. మెసపటోమియా అంటే నదుల మధ్యన గల ప్రాంతం. మెసపటోమియాఅనేది టైగ్రిస్ మరియు యూఫ్రటీసు మధ్య గల ప్రాంతం. ఇది ఇరాక్ లో నుండి సిరియా మరియు టర్కీ లోనికి వ్యాపిస్తున్న ప్రాంతం. (ఆది 2:10-14)లో చెప్పబడిన రీతిగా ఒక నది ఏదెనులో నుండి బయలు దేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు నదులైనాయి. మొదటిదాని పేరు పీషోను, రెండవ నది పేరు గీహోను, మూడవ నది పేరు హిద్దెకెలు, నాలుగవ నది యూఫ్రటీసు. నాలుగు నదులలో రెండు నదులు ఇక్కడే ఉన్న కారణాన, ఈ ప్రాంతం అనేకమైన బైబిల్ కార్యక్రమాలకు కేంద్రముగా ఉన్న కారణాన ఇంకా అనేకమైన కారణాలను బట్టి ఏదెను తోట ఇక్కడే అని బైబిల్ పండితులు అభిప్రాయం.
ఇంకా ఒక ముఖ్యమైన కారణమేమిటంటే జలప్రళయం తర్వాత భూమి యొక్క స్వరూపం మారిపోయింది. ఇది భూమికి మాత్రమే కాదు నదులకు, సముద్రాలకు కూ డా సంభవించినది. జలప్రళయం తర్వాత పీషోను,గీహోను నదులను గురించిన ప్రస్తావన లేదు. (గీహోను అనే వసంత ఋతువు వుంది) జలప్రళయం తర్వాత అవి రెండు కనుమరుగైనవని అంచనా. అలాగే టైగ్రిస్ మరియు యూఫ్రటీసు నదులు కూడా తుడిచివేయబడి ఉండవచ్చు. లేకపోతే వాటి రూపు రేఖలు మార్పుచెంది ఉండవచ్చు. వేరే నదులకు ఆ పేర్లు పెట్టి ఉండవచ్చు. ఒకవేళ ఇప్పుడు చెప్పినదే నిజమైతే పైన మనం చెప్పినవన్నీ తప్పులే.
ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఏదెనులో(ఆది 2:9) ఉన్న జీవ వృక్షం ఇప్పుడు పరలోకంలో వుంది. (ప్రకటన 2:7)(ప్రకటన 22:2,14,19), కొంతమంది అంటారు జలప్రళయం సందర్బములో పరలోకానికి ఎత్తబడిందని.

No comments:
Post a Comment