దేవుని సంగతులను సాతాను ఎలా వక్రీకరిస్తాడు ?
సాతాను ఒక అబద్ధికుడు. (యోహాను 8:44), మరియు మోసగాడు (ప్రకటన 20:7-8,10). వాడు ఎన్నుకొనే మార్గాలు ఎలాంటివంటే దేవునికి సంబందించిన మంచి సంగతులను నకిలీవిగా తయారుచేసి, ఏవి దేవునివో ఏవి సాతానువో కనుగొనలేనంతగా ప్రజలను పిచ్చివాళ్లను చేస్తాడు.
సాతాను చేసే నకిలీవి ఏంటి?
దేవుడు తన మాటలను ప్రకటించడానికి ప్రవక్తలను పంపితే , సాతాను కూడా అబద్ద ప్రవక్తలను పంపుతాడు. (1 యోయాను 4:1)(మత్తయి 24:11,24)(మత్తయి 7:15-16).
దేవుడు తన వాక్యాన్ని ప్రకటించడానికి బోధకులను ఇస్తే సాతాను అబద్ద బోధకులను ఇస్తాడు. (2 పేతురు 2:1-3)(1 తిమోతి 4:1-3)(2 యోహాను 1:9-11)(మలాకి 2:8-9)(గలతి 1:6-9).
యేసు లోకానికి వెలుగైతే (యోహాను 1:7-9)(యోహాను 8:12)(లూకా 2:32)(యోహాను 12:35-36), వాడు వెలుగు దూత వలే వేషం వేస్తున్నాడు. (1 పేతురు 5:8).
దేవుడు త్రిత్వం అయితే సాతాను కూడా "అపవిత్ర మైన త్రిత్వం , (ప్రకటన 16:13).
సాతాను దేవుని మాటలను అర్ధం మార్చి తన దురుద్దేశం నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడు. (మత్తయి 4:1-11).
దేవుడు సంఘానికి ఇచ్చిన తలాంతులు దుర్వినియోగపరిచి ప్రజలలో కలవరం తీసుకొస్తాడు. ఉదా: భాషలు, ప్రవచనాలు .
యేసుక్రీస్తు వారు "యూదా సింహం" (ప్రకటన 5:5) గ వర్ణించబడితే సాతాను తనను తానూ గర్జించే సింహంగా" పోల్చుకున్నాడు. (1 పేతురు 5:8).
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కాబట్టి ఏది దేవుని సంబందించినది ఏది నకిలీది అనేది మనం ఎలా గుర్తుపట్టేది?కాబట్టి మనం వాక్యాన్ని బాగా చదివాలి, ధ్యానించాలి. బాగా ప్రార్థనలో గడపాలి. అప్పుడే మనం గమనించగలం.

No comments:
Post a Comment