యేసు యొక్క 12 మంది శిష్యులు ఎలా చనిపోయారు?
మనకు తెలిసినంతవరకు జెబెదయి కుమారుడైన యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. (అపో 12:2). యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తును అప్పగించిన తర్వాత ఉరి వేసుకొని చనిపోవడం మనకు తెలుసు. (మత్తయి 27:3-5)(అపో 1:18). ఇక మిగతా వారి గురించి చరిత్రను ఆధారంగా తెలుసుకోవచ్చు.
పేతురు, అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, యాకోబు (అల్ఫాయి కుమారుడు), సీమోను, తద్దయి లు సిలువ వేయడం ద్వారా చనిపోయారు.
పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. అంద్రెయ X ఆకారంలో సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వాలే సిలువ వేయబడడానికి మేము యోగ్యులము కాదు అని వారు తలంచారు.
మత్తయి కత్తి చేత లేక పదునైన ఆయుధం చేత చంపబడ్డాడు. తోమా బల్లెంతో పొడవడం వాళ్ళ చంపబడ్డాడు (బల్లెంతో పొడవబడిన గాయాలలో వేళ్ళు పెట్టి చూస్తేనే గాని నమ్మను అన్నవాడు బల్లెంతో పొడవబడడం ఆశ్చర్యం) . యోహాన్ ఒక్కడే సాధారణంగా చనిపోవడం జరిగింది.

No comments:
Post a Comment