లూసిఫర్ ఎవరు?
లూసిఫర్ (అంటే కాంతిని ధరించినవాడు లేక ఉదయ నక్షత్రం అని అర్ధం) అనే పదం బైబిల్ అంతటిలో ఒకేసారి ఉపయోగించబడింది. (యెషయా 14:12). (యెషయా 14:12-17) లోని వచనాలు బబులోను రాజునూ గురించి వర్ణించబడినప్పటికీ అనేక మంది అవి సాతానుకు కూడా వర్తిస్తాయని భావిస్తున్నారు. ఇవే వచనాలను (యెహెఙ్కేలు 28:11-17) లోని (తూరు రాజుతో పోలిస్తే ) అవి కూడా సాతానుకు వర్తిస్తాయి. ఇక్కడ మనకు సాతాను యొక్క పతనం కనబడుతుంది. (ఇవి కూడా చూడండి. లూకా 10:18, ప్రకటన 12:8-10)
సాతాను యొక్క పతనం ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు కానీ దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత జరిగి ఉండవచు. (అతడు పడిపోవడానికి ముందు ఏదెను తోటలో ఉన్నాడు యెహెఙ్కేలు28:13). ఏదిఏమైనప్పటికీ ఆదాము సృష్టించబడక ముందే ఏదెను తోటలో ఉన్నాడని చెప్పవచ్చు ఎందుకంటే ఆ తోటలోనే అవ్వను మోసపరచాడు. (ఆది 3).
పరలోకం నుండి తోయబడిన తర్వాత లూసిఫర్ పేరు "విరోధి" గ మార్చబడింది.
సరే ఇప్పుడు చదవబోయేదంతా ఊహ మాత్రమే సత్యం కాదు. కొంతమంది ఏమి నమ్ముతారంటే లూసిఫర్ ముగ్గురు ప్రధాన దూతలలో ముఖ్యుడు లేదా మిగతా దూతలకు నాయకుడు.(మిఖాయేలు,గాబ్రియేలు అనేవారు మిగతా ఇద్దరు) మిఖాయేలు ముఖ్యమైన భద్రత (guardian angel) విషయాలు చూస్తాడు. గాబ్రియేలు ముఖ్యమైన సందేశాలు తీసుకెళ్తాడు. లూసిఫర్ ముఖ్యమైన ఆరాధన నాయకుడు. ఇది లూసిఫర్ ను గురించిన కొంత వివరణ. (యెహెఙ్కేలు 28:13 ప్రకారం) తంబూరాలు, పైపులు మొదలైన వాద్యపరికరాలు ఆయనలో ఇమిడివున్నవి లేక అయన శరీరములో భాగాలు కావచ్చు.
కొంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు యోబుతో మాట్లాడుతూ "ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు" అని యోబు 38:4-7 లో చెప్పాడు. వీరు ఎవరు? ఇక్కడ బహువచనం వాడబడినది (ఉదయనక్షత్రములు అని ) లూసిఫర్ పేరు ఉదయనక్షత్రం . యేసుక్రీస్తు వారు కూడా ఉదయనక్షత్రం అని పిలిచారు. (ప్రకటన 22:16)(ప్రకటన 2:28). కానీ యోబులో చెప్పబడిన "ఉదయనక్షత్రములు" ఎవరు?
.
కాబట్టి ఇది ఒక ఊహ. నిజమో కాదు. దీన్ని గురించి ఎక్కువ ఆలోచించవద్దు.

No comments:
Post a Comment