Saturday, 6 August 2016

డైనోసార్లు నిజంగా ఉన్నాయా?

యోబు గ్రంధము క్రీ .పూ 2000 సంవత్సరాలకు క్రితం రాయబడింది. అనేకమంది పండితులు జల ప్రళయం తర్వాత రాయబడింది అని నమ్ముతారు. యోబు  గ్రంధము 40:15-24, 41 అధ్యాయాలలో  కనిపించే "గొప్ప జంతువు" ను డైనోసార్ గా అనేకమంది ఒప్పుకుంటున్నారు. 
ఈ "గొప్ప జంతువు" యొక్క లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి. 
యోబు 40:15 ఎద్దు లాగ గడ్డి మేయును,
యోబు 40:17 దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును
యోబు 40:18 దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి దాని ప్రక్క టెముకలు 
 ఇనుపకమ్ములవలె ఉన్నవి 
యోబు 40:23నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యొర్దానువంటి ప్రవాహము పొంగి దానినోటియొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు
ఇది ఒక గొప్ప జంతువు అని చెప్పబడింది. అనేకమంది బైబిల్ పండితులు దీనిని ఏనుగు అని నీటిగుర్రం అని చెప్తున్నారు. కానీ 17వ వచనం ప్రకారం దాని తోకను గురించి  " దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును" అని రాయబడింది. కానీ ఏనుగు తోక గాని  నీటిగుర్రం తోక గాని చాలా చిన్నవి మరియు వంగిపోయి ఉంటాయి.  ఈ రోజు మనం అలాంటి దేవదారుచెట్టు కొమ్మవంటి తోక,  ఇత్తడి యెముకలు, ఇనుపకమ్ముల వంటి ప్రక్క టెముకలు గల జంతువును ఊహించలేము. 
మకరమును యొక్క లక్షణాలు:
(Job 41:1నీవు మకరము నాలుకకు త్రాడువేసి లాగగలవా?
(41:7) దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా?
(41:10) దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు
(41:12) దానికి బలమైన అవయవములు కలవు. 
(41:13) దాని చర్మము రెండింతల పొరల కవచం కలిగినది. 
(41:14) దానికి భయంకరమైన దంతాలు కలవు.
(41:15) అది గట్టి పొలుసులు చేత సంతనచేయబడి యున్నది. .
(41:22) అది  బలమైన మెడ కలిగి వుంది.  .
(41:25) అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు
(41:26) దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్క రకు రావు
(41:28-29) బాణము దానిని పారదోలజాలదు వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలె ఉన్నవి. దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును.

41:30) దాని క్రిందిభాగములుకరుకైనచిల్లపెంకులవలె ఉన్నవి

     పైన చెప్పబడినది ఏ జంతువు ?? అనేకమంది దీన్ని మొసలి అని  లేక మొసలి జాతికి సంబంధిచినదని చెప్తారు. . ఎంత వరకు నిజమో చూద్దాం. :
(verse 1) దీని నోటిని తాడుతో కట్టడం మనం టీవీ లలో సర్కస్ లలో చూడలేదా?
(verse 10)మొసలితో పోరాడి దాన్ని లొంగదీసుకున్న సంఘటనలు మనం చూడలేదా?
(verse 12) మొసలికి బలమైన అవయవాలు ఉన్నాయా? (కాళ్ళు చేతులు )?
(verse 25) మొసళ్ళు పైకి లేస్తాయా ?
(verse 26) కత్తి గాని బల్లెం గాని దానికి హాని చేయలేవా ?
(verse 30) మొసలి అడుగు భాగం కరుకైనదా ?

(రోమా 5:12)(ఆది 2:17)(ఆది  3:19)(1 కొరింథీ  15:21-22) ప్రకారం మరణం అనేది ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాతనే సంబవించినది. పాపానికి ముందు మరణం లేదు. కాబట్టి డైనోసార్లు మనిషి కి కొన్ని బిలియన్ సంవత్సరాలకు ముందు జీవించి చనిపోయాయి అనేది వాక్యానికి విరుద్ధం.  అంతేకాదు మనిషి డైనోసార్లు కలిసి జీవిచాయి అనేదానికి రుజువులున్నాయి. చైనా,ఆఫ్రికా, ఇండియా, ఇంగ్లాండ్ మరియు మధ్య ఆసియ దేశాల ప్రాచీన రచనలో వీటి ప్రస్తావన వుంది. వీరు డ్రాగన్స్ అనే పదాన్ని వాడారు. డైనాసార్లు  అనే పదం  1841లో కనిపెట్టబడింది. ప్రాచీన కాలం యొక్క పెయింటింగ్స్ మీద మనిషి, డైనోసార్ కలిసి ఉన్నట్లు వున్నాయి. 
చివరగా నోవహు ఓడలోకి కూడా వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే యోబు గ్రంధం జల ప్రళయం తర్వాత రాయబడింది. అవి చిన్న డైనోసార్లు కావచ్చు. జల ప్రళయం తర్వాత అవి చనిపోయి ఉంటాయి. వాటి మరణానికి మూడు కారణాలుండవచు. 1. జలప్రళయం తర్వాత ఆహారానికి ఇబ్బంది. 2. జలప్రళయం వాళ్ళ వాతావరణంలో మార్పులకు, 3.  మనిషే ఆహారం కోసం చంపివుండవచ్చు 

No comments:

Post a Comment