వైద్యుడు - పరమ వైద్యుడు
లూకా 4:38-39
ఆయన సమాజమందిరములోనుండి లేచి, సీమోను ఇంటిలోనికి వెళ్లెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి.
39 ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను.
39 ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను.
వైద్యుడు
డియర్ ఫ్రెండ్స్ , ప్రస్తుతం జ్వరం వస్తే తగ్గించడానికి కనీసం 3,4 రోజులు పడుతుంది. జ్వరం తగ్గిన తర్వాత మామూలు మనిషి కావడానికి ఇంకా 3 రోజులు పడుతుంది. అప్పటికి గాని లేచి పనులు చేయగలరు. అది మంచి స్పెషలిస్ట్ డాక్టర్ అయి సరే.
పరమ వైద్యుడు
కానీ పైన చెప్పబడిన అద్యాయములో యేసుక్రీస్తు వారు తీవ్రజ్వరంతో బాధపడుతున్న పేతురు అత్తయొక్క జ్వరాన్ని గద్దించాడు అంతే, జ్వరం ఆమెను విడిచింది. ఆమె లేచి వారికి ఉపచారము చేసింది.
పైన సందర్భములోనైతే వేరే వారు పేతురు అత్తకు ఉపచారము చేసారు, ఈ సందర్బములో ఆమె లేచి వారికీ ఉపచారము చేసింది. ఆమెకు పూర్తి శక్తి, ఆరోగ్యం వచ్చాయి. ఆమె ఒక సాధారణమైన ఆరోగ్యవంతమైన స్త్రీగా బాగయింది.
1. కుష్ఠరోగినైనా సరే మాట మాత్రం సెలవు చేత బాగు చేయగలడు
2. గుడ్డివారికి
3. కుంటివారికి
4. రక్తస్రావం గల స్త్రీకి
5. గెత్సేమనే తోటలో చెవి తెగిన వ్యక్తికి
6. దయ్యం పట్టిన వారిని
7. చెవుడు మూగ వ్యక్తిని
8. నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట
9. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించుట
10. 4 రోజులుగా కుళ్లిపోయిన మనిషిని బ్రతికించుట
ఇంకా అనేకం ఆయనకే సాధ్యము.

No comments:
Post a Comment